Sri Vinayaka Vrata Kalpam (Part 2) – వినాయక వ్రత కల్ప విధానము 2


వినాయక వ్రత కల్ప విధానము 2

|| వినాయక పూజ ప్రారంభం ||
పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని పీట మీద తూర్పు ముఖంగా కూర్చోని కింది విధంగా చదువుకోవాలి.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!

అయం మొహోర్తః సుముహోర్తోస్తు
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్ర బలం తదేవ
విద్యాబలం తదేవ
లక్ష్మీ పతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరోపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్సుంసాం సర్వతో జయమంగళమ్

అని చదివాక, పసుపుతో చేసిన వినాయకుడికి కుంకుమబొట్టు పెట్టి అక్షింతలు చల్లి నమస్కరించుకోవాలి.

|| ప్రార్థన ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః |
ధూమకేతు ర్గుణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజః ||

అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు ఉంచాలి. అక్షితలు తీసుకుని పసుపు గణపతిపై వేసి నమస్కరిస్తూ ... 
సుముహుర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహణం అనుకూల్య ఫలసిద్ధిరస్తూ ...
అని పఠించాలి.

|| ఆచమనం ||
ఆచమ్యా
ఓం కేశవాయ స్వాహాః (స్త్రీలయితే కేశవాయనమః అనాలి),
ఓం నారాయణాయ స్వాహాః,
ఓం మాధవాయ స్వాహాః
అని చదువుతూ ఉద్ధరిణతో కుడి అరచేతిలో నీరు పోసుకుని త్రాగిన తరువాత మళ్ళీ నీళ్లు తీసుకుని కుడిచేతిని కడుక్కోవాలి. ఇలా మూడుసార్లు ఆచమనం చేయాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్తనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఈ కింది మంత్రాన్ని చెబుతూ, కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

|| భూతోచ్చాటన ||
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
అనే మంత్రాన్ని చదివి అక్షతలు వాసన చూసి, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వదలాలి. తరువాత ప్రాణాయామం చేయాలి.
ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః
అని నాలుగు దిక్కులా ఉద్ధరిణతో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.


|| దీపారాధన ||
దీపం వెలిగించి, పూలు, అక్షితలు వేసి నమస్కారం చేయాలి. (ఈ క్రింది మంత్రాలు చదువుతూ పూలు, అక్షితలు పసుపు గణపతిపై వేయాలి)
ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం సీతారామాభ్యాం నమః,
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః

|| సంకల్పం: ||
ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య, అద్య బ్రాహ్మణ:, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… శ్రీ శైలస్య (తెలంగాణ వాళ్ళు వాయువ్య ప్రదేశే అని, రాయలసీమ వాళ్ళు ఆగ్నేయ ప్రదేశే అని, కోస్తాంధ్ర వాళ్ళు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి) ప్రదేశే, శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ పరిహార గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్థ్యాం తిథి ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ (వారివారి గోత్రం, పేరు చదువుకోవాలి) ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే

|| కలశ పూజ ||
అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం, శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే
అని చెప్పి అక్షతలు, నీళ్లు వదలాలి. కలశానికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేసి, చేయి వేసి ఇది చదవండి..

|| దేవతీర్ధాద్యావహనము ||
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర నమాశ్రితః
మూలో తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతుసాగరాః సర్వ్ సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ ... 
గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య
ఏవమాత్మానంచ సంప్రోక్ష్య
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడి మీద, తమమీద కొద్దిగా చిలకరించుకోవాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమోనమః ప్రాణప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తస్తు .. 
అని గణపతి విగ్రహంపై అక్షతలు వేయాలి.

స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని అక్షింతలు వేసి నమస్కారం చేయాలి.

గణానాంత్వా గణపతిగ్ం హావమహే, కవిం కవీనా ముపమశ్రవస్తమమ్ 
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్సత అనశ్శ్రుణ్వన్నూతిభిస్సీద సాధనమ్ !!
అని రెండు పువ్వులు వేసి నమస్కారం చేయాలి. 

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహయామి ఆసనం సమర్పయామి
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాదయో: పాద్యం సమర్పయామి
హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

|| ఉపచారిక స్నానం .. ||
కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి మీద చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః     - స్నానం సమర్పయామి
స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగానాదిపర్తయే నమః     - వస్త్రం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః     - యజ్ఞోపవీతం సమర్పయామి,
శ్రీ మహాగణాధిపతయే నమః     - శ్రీగంధాన్ ధారయామి,
శ్రీ మహాగణాధిపతయే నమ      - పుష్పై: పూజయామి
శ్రీ మహాగణాధిపతయే నమః     - నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః     - ధూపమాఘ్రాపయామి (ధూపం చూపించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః     - దీపం దర్శయామి (దీపం చూపించాలి)
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ      - తాంబూలం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః     - నీరాజనం సమర్పయామి
(హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి)

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి: ప్రచోదయాత్
శ్రీ మహాగణాధిపతయే నమః ...     మంత్రపుష్పం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ...     చ్ఛత్రమచ్చాదయామి
చామరం వీచయామి ...             నృత్యం దర్శయామి
గీతామాశ్రావయామి ...              వాద్యం ఘోశాయామి ..
ఆశ్వానారోహయామి ...             గాజానారోహయామి ..
శకటనారోహయామి ...             ఆందోళికానారోహయామి ..
అని అక్షితలు వేయాలి

సమస్త రాజోపచారశక్త్యుపచార భక్త్యుపచార పూజాస్సమర్పయామి ... 
అని నీళ్లు, అక్షితలు పళ్లెంలో వదలాలి.
శ్రీ మహాగణపతి దేవతా స్సుప్రాతస్సుప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో ర్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు.

శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణమి
పసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.

శ్రీ మహాగణాధిపతయే  నమః యథాస్థానం ప్రవేశయామి
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ ..
అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి.
ఇక్కడకి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.

|| వరసిద్ధి వినాయకవ్రత ప్రారంభం .... ||
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణ ప్రతిష్ఠాపాన ముహూర్త స్సుముహూర్తస్తూ ...
అని మట్టి గణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.

స్వామిస్ సర్వజగన్నాథ యావత్సూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిస్ సన్నిధిం కురు !!
స్తిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద
అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలు, పూలు వేసి నమస్కరించాలి.

|| షోడశోపచార పూజ ||
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే !!
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ !!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ !!

|| ధ్యానమ్ ||
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్ !!
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
ధ్యాయామి ధ్యానం సమర్పయామి

|| ఆవాహనం ||
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ..
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః ఆవాహయామి:
(అక్షతలు వేయాలి)

|| ఆసనం ||
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
ఆసనం సమర్పయామి:
(అక్షతలు లేదా పూలు వేయాలి)

|| ఆర్ఘ్యం ||
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతమ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
ఆర్ఘ్యం సమర్పయామి:
(తమలపాకుతో స్వామి పైన నీళ్లు చల్లాలి)

|| పాద్యం ||
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
పాద్యం సమర్పయామి:
(మళ్ళీ కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాలముందుంచాలి)

|| ఆచమనీయం ||
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనం దేవా, తుభ్యం దత్తంమయా ప్రభో
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
ఆచమనీయం సమర్పయామి:
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

|| మధుపర్కం ||
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
మధుపర్కం సమర్పయామి:
(పత్తి, దూదితో చేసిన పెద్ద వత్తుకి మధ్య మధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)

|| పంచామృత స్నానం ||
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి:
(తేనె, పెరుగు, నెయ్యి, పాలు, చెరుకురసం కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామి వారిపై చల్లాలి)

|| శుద్ధోదక స్నానం ||
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః
స్నానం కురుష్వభగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
శుద్దోదక స్నానం సమర్పయామి:
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

|| వస్త్రం ||
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
వస్త్రయుగ్మం సమర్పయామి: (నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి)

|| యజ్ఞోపవీతం ||
రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం
గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
యజ్ఞోపవీతం సమర్పయామి:
(దూదితో చేసిన పెద్ద వత్తుకి మధ్య మధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)

|| గంధం ||
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
గంధం సమర్పయామి:
(గంధం స్వామిపై చిలకరించాలి)

|| అక్షతలు ||
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
అక్షతాన్ సమర్పయామి:
(కొన్ని అక్షతలు వేయాలి)

|| పుష్పాలు ||
సుగంధాని చ పుష్పాణి జాజీకుంద ముఖానిచ
ఏక వింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
పుష్పాణి సమర్పయామి:
(స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి)

|| సింధూరం ||
ఉద్యద్భాస్కార సంకాశం సంధ్యా వదఋణంప్రభో !
వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం !!
వరసిద్ధి వినాయకాయ, సింధూర భూషణం సమర్పయామి

|| మాల్యం ||
మాల్యాదీని సుగంధాని మాలత్యా దీనివై ప్రభో !
మాయాహృతాని పుష్పాణి ప్రతిగృహ్ణీష్వ శాంకర !! 
వరసిద్ధి వినాయకాయ, పుష్పమాల్యాని సమర్పయామి

|| నైవేద్యం ||
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యం త్వర్తేన పరిషించామి
అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.

అమృతమస్తు అని పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి.

అమృతోపస్తరణమసి అని నైవేద్యం పైన నీళ్లు చల్లి,
శ్రీ మహాగణాధిపతయే నమః నారికేళ సహిత కదళీఫల సహిత గుడోపహారం నివేదయామి
అంటూ అయిదు సార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.

ఓం ప్రాణాయ స్వాహా !
ఓం అపానాయా స్వాహా !
ఓం వ్యానాయ స్వాహా !
ఓం ఉదానాయ స్వాహా !
ఓం నమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ! 
అని నీళ్లు వదలాలి.

అమృతాపిథానమసి ... ఉత్తరాపోశనం సమర్పయామి ... హస్తౌ ప్రక్షాళయామి ... పాదౌ ప్రక్షాళయామి ... ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి.

|| అథాంగ పూజ.. పుష్పాలతో పూజించాలి ||
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూం పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
స్కందాగ్రజాయ నమః - స్కందౌ పూజయామి
పాశహస్తాయ నమః - హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

|| అథ ఏకవింశతి పత్రపూజ ||
ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.
ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి, (దర్భ)
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి, (వాకుడు)
ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి, (మారేడు)
ఓం గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి, (గరికె)
ఓం హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి, (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి, (రేగు)
ఓం గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి, (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి, (మర్రి)
ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి, (మామిడి)
ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి, (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి, (నీలంపువ్వుల చెట్టు ఆకు)
ఓం వటవేనమః - దాడిమీపత్రం పూజయామి, (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి, (మరువం)
ఓం హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి, (వావిలి)
ఓం శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి, (జాజిపత్రి)
ఓం సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి, (తెల్ల గరికె)
ఓం ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి, (జమ్మి)
ఓం వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి, (రావి)
ఓం సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి, (మద్ది)
ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి, (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి

|| ఏకవింశతి పుష్ప పూజా – (౨౧ పుష్పాలు) ||
ఓం పంచాస్య గణపతయే నమః పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః దాడిమీ పుష్పం సమర్పయామి | 
ఓం విష్వక్సేన గణపతయే నమః వకుళ పుష్పం సమర్పయామి | 
ఓం ఆమోద గణపతయే నమః అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి | 
ఓం ప్రమథ గణపతయే నమః పాటలీ పుష్పం సమర్పయామి | 
ఓం రుద్ర గణపతయే నమః ద్రోణ పుష్పం సమర్పయామి | 
ఓం విద్యా గణపతయే నమః దుర్ధూర పుష్పం సమర్పయామి | 
ఓం విఘ్న గణపతయే నమః చంపక పుష్పం సమర్పయామి | 
ఓం దురిత గణపతయే నమః రసాల పుష్పం సమర్పయామి | 
ఓం కామితార్థప్రదగణపతయే నమః కేతకీ పుష్పం సమర్పయామి | 
ఓం సమ్మోహ గణపతయే నమః మాధవీ పుష్పం సమర్పయామి | 
ఓం విష్ణు గణపతయే నమః శమ్యాక పుష్పం సమర్పయామి | 
ఓం ఈశ గణపతయే నమః అర్క పుష్పం సమర్పయామి | 
ఓం గజాస్య గణపతయే నమః కల్హార పుష్పం సమర్పయామి | 
ఓం సర్వసిద్ధి గణపతయే నమః సేవంతికా పుష్పం సమర్పయామి | 
ఓం వీర గణపతయే నమః బిల్వ పుష్పం సమర్పయామి | 
ఓం కందర్ప గణపతయే నమః కరవీర పుష్పం సమర్పయామి | 
ఓం ఉచ్చిష్ఠ గణపతయే నమః కుంద పుష్పం సమర్పయామి | 
ఓం బ్రహ్మ గణపతయే నమః పారిజాత పుష్పం సమర్పయామి | 
ఓం జ్ఞాన గణపతయే నమః జాతీ పుష్పం సమర్పయామి |

|| ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక) ||
ఓం గణాధిపాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం పాశాంకుశధరాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం ఆఖువాహనాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం వినాయకాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం ఈశపుత్రాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం ఏకదంతాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం ఇభవక్త్రాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం మూషికవాహనాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం కుమారగురవే నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం కపిలవర్ణాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం బ్రహ్మచారిణే నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం మోదకహస్తాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం గజనాసికాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం కపిత్థఫలప్రియాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం గజముఖాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం సుప్రసన్నాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం సురాగ్రజాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి | 
ఓం స్కందప్రియాయ నమః దూర్వారయుగ్మం సమర్పయామి |

|| గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రం ||
వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః ।
స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥
అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోఽవ్యయః ।
సర్వసిద్ధిప్రద-శ్శర్వతనయః శర్వరీప్రియః ॥ 2 ॥
సర్వాత్మకః సృష్టికర్తా దేవోఽనేకార్చితశ్శివః ।
శుద్ధో బుద్ధిప్రియ-శ్శాంతో బ్రహ్మచారీ గజాననః ॥ 3 ॥
ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః ।
ఏకదంత-శ్చతుర్బాహు-శ్చతుర-శ్శక్తిసంయుతః ॥ 4 ॥
లంబోదర-శ్శూర్పకర్ణో హర-ర్బ్రహ్మవిదుత్తమః ।
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః ॥ 5 ॥
పాశాంకుశధర-శ్చండో గుణాతీతో నిరంజనః ।
అకల్మష-స్స్వయంసిద్ధ-స్సిద్ధార్చితపదాంబుజః ॥ 6 ॥
బీజపూరఫలాసక్తో వరద-శ్శాశ్వతః కృతీ ।
విద్వత్ ప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ ॥ 7 ॥
శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః ।
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః ॥ 8 ॥
చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః ।
అశ్రిత-శ్రీకర-స్సౌమ్యో భక్తవాంఛితదాయకః ॥ 9 ॥
శాంతః కైవల్యసుఖద-స్సచ్చిదానందవిగ్రహః ।
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః ॥ 10 ॥
ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః ।
రమార్చితో నిధి-ర్నాగరాజయజ్ఞోపవీతవాన్ ॥ 11 ॥
స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః ।
స్థూలతుండోఽగ్రణీ-ర్ధీరో వాగీశః-సిద్ధిదాయకః ॥ 12 ॥
దూర్వాబిల్వప్రియోఽవ్యక్తమూర్తి-రద్భుతమూర్తిమాన్ ।
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః ॥ 13 ॥
స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహః ।
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః ॥ 14 ॥
హృష్ట-స్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః ।
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ ॥ 15 ॥
తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముద్యతః ।
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ ॥ 16 ॥
దూర్వాదళై-ర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః ।
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ॥ 17 ॥

|| అష్టోత్తర శతనామ పూజావళి ||
ఓం గజాననాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్విముఖాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం కృతినే నమః |
ఓం సుప్రదీప్తాయ నమః || 10 ||

ఓం సుఖనిధయే నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం సురారిఘ్నాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహాకాలాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం లంబజఠరాయ నమః |
ఓం హయగ్రీవాయ నమః || 20 ||

ఓం మహోదరాయ నమః |
ఓం మదోత్కటాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం మంగళ స్వరాయ నమః |
ఓం ప్రమధాయ నమః |
ఓం ప్రథమాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం విఘ్నకర్త్రే నమః |
ఓం విఘ్నహంత్రే నమః || 30 ||

ఓం విశ్వనేత్రే నమః |
ఓం విరాట్పతయే నమః |
ఓం శ్రీపతయే నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం శృంగారిణే నమః |
ఓం ఆశ్రిత వత్సలాయ నమః |
ఓం శివప్రియాయ నమః |
ఓం శీఘ్రకారిణే నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం బలాయ నమః || 40 ||

ఓం బలోత్థితాయ నమః |
ఓం భవాత్మజాయ నమః |
ఓం పురాణ పురుషాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం అగ్రపూజ్యాయ నమః |
ఓం అగ్రగామినే నమః |
ఓం మంత్రకృతే నమః |
ఓం చామీకర ప్రభాయ నమః || 50 ||

ఓం సర్వాయ నమః |
ఓం సర్వోపాస్యాయ నమః |
ఓం సర్వ కర్త్రే నమః |
ఓం సర్వనేత్రే నమః |
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః |
ఓం సర్వ సిద్ధయే నమః |
ఓం పంచహస్తాయ నమః |
ఓం పార్వతీనందనాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం కుమార గురవే నమః || 60 ||

ఓం అక్షోభ్యాయ నమః |
ఓం కుంజరాసుర భంజనాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం మోదకప్రియాయ నమః |
ఓం కాంతిమతే నమః |
ఓం ధృతిమతే నమః |
ఓం కామినే నమః |
ఓం కపిత్థవనప్రియాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః || 70 ||

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం విష్ణుప్రియాయ నమః |
ఓం భక్త జీవితాయ నమః |
ఓం జిత మన్మథాయ నమః |
ఓం ఐశ్వర్య కారణాయ నమః |
ఓం జ్యాయసే నమః |
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః |
ఓం గంగా సుతాయ నమః |
ఓం గణాధీశాయ నమః || 80 ||

ఓం గంభీర నినదాయ నమః |
ఓం వటవే నమః |
ఓం అభీష్ట వరదాయినే నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం భక్త నిధయే నమః |
ఓం భావగమ్యాయ నమః |
ఓం మంగళ ప్రదాయ నమః |
ఓం అవ్వక్తాయ నమః |
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః |
ఓం సత్యధర్మిణే నమః || 90 ||

ఓం సఖయే నమః |
ఓం సరసాంబు నిధయే నమః |
ఓం మహేశాయ నమః |
ఓం దివ్యాంగాయ నమః |
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః |
ఓం సమస్తదేవతా మూర్తయే నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం సతతోత్థితాయ నమః |
ఓం విఘాత కారిణే నమః |
ఓం విశ్వగ్దృశే నమః || 100 ||

ఓం విశ్వరక్షాకృతే నమః |
ఓం కళ్యాణ గురవే నమః |
ఓం ఉన్మత్త వేషాయ నమః |
ఓం అపరాజితే నమః |
ఓం సమస్త జగదాధారాయ నమః |
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః |
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః |
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః || 108 ||

అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి || 
నానావిధపత్రపుష్పాణి సమర్పయామి ||

|| బిల్వం ||
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం !
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం !!
వరసిద్ధి వినాయకాయ, బిల్వపత్రం సమర్పయామి

|| ధూపం ||
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహనవరదోభవ ధూపమాఘ్రపయామి (అగరవత్తుల ధూపం స్వామికి చూపించాలి)

|| దీపం ||
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్ని నాద్యోతితం మయా గృహన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి
(దీపాన్ని స్వామికి చూపించాలి)

|| నైవేద్యం ||
మహానివేదన (పిండివంటలు, అన్నం, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు స్వామి ముందుంచాలి)

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః
మహా నైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
అని నైవేద్యంపై నీళ్లు చల్లాలి

సత్యం త్వర్తేన పరిశించామి ... నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి
అమృతమస్తు ... స్వామి దగ్గర నీళ్లు వదలాలి
అమృతోపస్తరణమసి ... అని నైవేద్యంపైన నీళ్లు చల్లి ఈ క్రింది మంత్రాలు చదువుతూ అయిదు సార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామికి చూపిస్తూ ఈ క్రింది విధంగా చదవాలి.
ఓం ప్రాణాయ స్వాహా ... ఓం అపానాయ స్వాహా ... ఓం వ్యానాయ స్వాహా ... ఓం ఉదనాయ స్వాహా ... ఓం సమనాయ స్వాహా ... మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (స్వామి దగ్గర నీళ్లు చల్లాలి)
అమృతాపిథానమసి ... ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి ... పాదౌ ప్రక్షాళయామి ... ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ... అంటూ నీళ్లు వదలాలి.

|| పానీయం ||
మహాస్వాద్యమిదం దివ్యం పానీయం తే నిషేదితం !
మయాభాక్త్యా శివాపుత్ర గృహాణ గణనాయక !!

|| తాంబూలం ||
ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ తాంబూలం సమర్పయామి (తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచాలి)

|| నీరాజనం ||
(లేచి నిల్చుని ఈ మంత్రంతో హారతి ఇవ్వాలి)
ఘ్రుతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహనవరదోభవ
నీరాజనం సమర్పయామి
(హారతి పాత్రపై కొంచెం నీళ్లు వదిలి, కుంకుమ పెట్టి హారతిని కళ్ళకు అద్దుకోవాలి)

|| మంత్రపుష్పం ||
(నిలుచుని చేతిలో పువ్వులు అక్షతలు తీసుకుని చదవాలి)
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్
శ్రీ మహాగణాధిపతయే నమః ... మంత్రపుష్పం సమర్పయామి

|| ప్రదక్షిణ ||
యానికానిచ పాపని జన్మాన్తరకృతానిచ !
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణం పదేపదే !!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ !
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప !!
అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి !!
(ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి)

ఆ తరువాత మళ్ళీ కూర్చుని కొన్ని అక్షితలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షితలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు.
శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు ...
అంటూ అక్షతలను నీటిని పళ్లెంలో వదలాలి. పూజాక్షతలు శిరస్సున ధరించాలి.

Comments