Sri Vinayaka Dandakam telugu – శ్రీ వినాయక దండకం


శ్రీ వినాయక దండకం

    శ్రీ పార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివా సిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులు న్నీకరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమం బక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులన్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ వడల్ పునుగులున్బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు కుడుముల్ వడపప్పు పానకంబున్ మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యముం బంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను పూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్చేయుటల్ కాంచనం బొల్లకే యిన్ముదా గోరుచందంబు గాదే! మహాదేవ యో భక్తమందార! యో సుందరాకార! యో భాగ్య గంభీర! యో దేవచూడామణీ లోకరక్షామణీ! బంధు చింతామణీ! స్వామి నిన్నెంచ, నేనెంత నీ దాసదాసానుదాసుండ శ్రీ దొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే నమస్తే నమః ||

Comments